Actor Balakrishna | కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు వరించాయి. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి (వైద్యరంగం) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. మంద కృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు) పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
ఏపీ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కళల విభాగంలో హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. అలాగే, కేజీఎఫ్ నటుడు ఆనంత్నాగ్కు పద్మభూషణ్, ప్రముఖ తమిళ హీరో అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, ప్రముఖ సినీ నటి, నృత్యకళాకారిణి శోభనకు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. కేఎల్ కృష్ణ (సాహిత్యం-విద్యారంగం), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), మిర్యాల అప్పారావు (కళలు-మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం-విద్యారంగం)కు పద్యశ్రీ అవార్డులు వరించాయి.