అమీర్‌పేట్, సెప్టెంబర్ 21: పండుగ వేళల్లో వినియోగదారులకు ముందస్తు వేడుకను అందించే దిశగా ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘దసరా షాపింగ్ బొనాంజా’ బుధవారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాసరెడ్డితోపాటు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఆపరేషన్స్ హెడ్ చక్రధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పండుగ బొనాం జా ఈనెల 30 వరకు కొనసాగుతుంది.
కేఎల్ఎం ఫ్యాషన్స్, ఫ్రీడమ్ ఆయిల్, సీఎంఆర్, బిగ్ సీ, కేఫ్ నీలోఫర్‌తోపాటు.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల ప్రకటనలో ప్రచురించిన సంస్థల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ఈ బంపర్ బొనాంజాకు సంబంధించిన కూపన్లను ఆయా షాపులల్లో ఇస్తారు. వాటిని ఆయా షాపుల్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. ప్రతిరోజు ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. కాగా విజేతలకు మొదటి బహుమతి 32 ఇంచుల టెలివిజన్, రెండో బహుమతి మైక్రోవేవ్ ఓవెన్, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాలుగో బహుమతిగా ప్రగతి రిసార్ట్స్ గిఫ్ట్ వోచర్, ఐదో బహుమతిగా కేఫ్ నీలోఫర్ గిఫ్ట్ హాంపర్ ఇస్తారు. బొనాంజా చివర్లో బంపర్ డ్రా పేరుతో విజేతకు నిసాన్ మాగ్నెట్ కారును బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రకటల విభాగం హెడ్ సునీల్, నమస్తే తెలంగాణ ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి, రామకృష్ణ యాదవ్, డిప్యూటీ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.