మర్రిగూడ, నవంబర్ 9 : మునుగోడులో ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన లెంకలపల్లి ఆవాస గ్రామం సరంపేటకు మహర్దశ పట్టింది. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సరంపేటకు ఎన్నికల ఇన్చార్జిగా ప్రచార బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం గ్రామాన్ని సందర్శించారు.
అధికారు లు, గ్రామస్థులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రూ.35 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణం, మహిళా కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని తీర్మానించారు. దివ్యాంగురాలు రాములమ్మకు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తన సొంత డబ్బులతో ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి అందజేశారు.