హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యోగ నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ సూచించారు. గరిష్ఠ ఉపాధి సామర్థ్యం ఉన్న తొలి రాష్ట్రంగా తెలంగాణ 85.45% నిలిచిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎకువగా ఉన్నాయని, ఇతర రాష్ర్టాల యువత తెలంగాణలోనే ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఇతర నైపుణ్యం కలిగిన యువత ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు అందివచ్చిన ప్రైవేటు ఉద్యోగాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ విదేశీ కంపెనీలను సైతం హైదరాబాద్ ప్రాంతంలోనే ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. కేసీఆర్ సరారు టీహబ్, టీవర్స్ను ఏర్పాటు చేసిందని, తద్వారా యువ ఇంజినీర్లను ఆంత్రప్రెన్యూయర్లుగా తయారు చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ఐటీ టవర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. టీహబ్, టీవర్స్ మధ్య సమన్వయం, అనేక హ్యాకథాన్లు, ఇన్నోవేషన్, ఛాలెంజ్‌ను ప్రభుత్వ సహకారంతో నిర్వహించినట్టు స్వయంగా సిల్ ఇండియా నివేదికలో పేర్కొన్నదని తెలిపారు.