టీఆర్ఎస్కు ఓటు వేయాలని సైగలతో ప్రచారం
జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 4: జమ్మికుంట మండలం నగురం గ్రామంలో పొల్సాని కార్తీక్ అనే దివ్యాంగుడు (మూగ) టీఆర్ఎస్ తరఫున చేస్తున్న ఎన్నికల ప్రచారం ఆకట్టుకుంటున్నది. గ్రామానికి చెందిన కార్తీక్ పుట్టు మూగ. బధిరుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ వరకు చదివిన కార్తీక్ ప్రస్తుతం గ్రామంలోనే ఉంటున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనాలను నడుపుతారు. వ్యవసాయ పనుల్లో సైతం చురుగ్గా ఉంటూ గ్రామంలో అందరి నోళ్లలో నానుతుంటారు. కార్తీక్కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న దివ్యాంగుల పింఛన్ రూ.3 వేలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో తప్పకుండా కారు గుర్తకే ఓటు వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ అందరినీ వేడుకుంటున్నారు. దివ్యాంగులకు సీఎం కేసీఆర్ రూ.3 వేల పెన్షన్ ఇవ్వడంతోపాటు 24 గంటలు కరంటును ఇస్తున్నారని తన సైగల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు.