ఆదిలాబాద్ : వ్యవసాయం రైతుకు భారంగా మారుతుంది. అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య ( Suicide) బాట పడుతున్నారు. ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బంధులతో ఆత్మహత్యకు ఒడిగట్టారు. వీరిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.
మండలంలోని వడూర్కు చెందిన ఆడెపు పోశెట్టి(60), ఇందిరా(52) అనే రైతు దంపతులు ఆర్థిక సమస్యల కారణంగా పురుగుల మందు ( Festicide ) తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పోశెట్టి మరణించగా భార్య ఇందిరాను చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి దంపతులకు మూడెకరాల భూమి ఉండగా ఇటీవల పత్తి కంది పంటలను సాగు చేశారు.
వీరికి రెండు లక్షల 30 వేల వరకు అప్పులు ఉన్నాయి. పంట నష్టంతో పాటు వారికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ సైతం మాఫీ కాలేదు. ఇటీవల ఇద్దరు కూతుర్ల వివాహం చేయడంతో పాటు, నూతన గృహం సైతం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు.