హైదరాబాద్ : రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని టీఎస్పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో రేపు ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. మల్టీ జోన్ -1లో 54, మల్టీ జోన్-2లో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే.