చెన్నూర్ రూరల్, ఆగస్టు 3 : చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం బాతుల పెంపకానికి నిలయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువకులు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని నిరుపయోగంగా మారుస్తున్నదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.