హైదరాబాద్ : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం పోలీస్ పాలనతో ప్రజల హక్కులను కాలరాస్తున్నది. చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకోలేని నిర్భంద పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతూ జైళ్లకు పంపుతున్నారు. అణచివేతలు, అక్రమ నిర్భందాలు నిత్యకృత్యమయ్యాయి.
తాజాగా దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని( MLA Prabhakar Reddy) పోలీసులు హౌస్ అరెస్ట్(House arrest) చేశారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటన ఉన్నందున హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన స్వగృహం నుంచి దుబ్బాకకు బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలన పోలీస్ రాజ్యంగా మారిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటన ఉన్నందున కారులో మాదాపూర్ స్వగృహం నుంచి దుబ్బాకకు బయలుదేరుతున్న క్రమంలో హౌస్ అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పాలన పోలీస్ రాజ్యంగా మారిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. pic.twitter.com/vI8mYPLaQP
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024