భూపాలపల్లి రూరల్, ఆగస్టు 24 : భూపాలపల్లి అర్బన్ బాలుర గురుకుల పాఠశాల టీచర్ రాజేందర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. పాఠశాల తాగునీటిలో విష పదార్థం కలిపిన ఘటనపై ఎంఈవో దేవానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. సైన్స్ టీచర్ పెండ్యాల రాజేందర్‌ను నిందితుడి గుర్తించి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కాగా, రాజేందర్‌ను శనివారం రాత్రి విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.