DSP Nalini | నవమి నాటికి తేల్చకపోతే సజీవ సమాధి అవుతా.. నాకెమైనా జరిగితే పూర్తిబాధ్యత రేవంత్ రెడ్డిదే: మాజీ డీఎస్పీ నళిని
చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని (DSP Nalini) ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26: చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని (DSP Nalini) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మరోసారి ఫేస్బుక్లో మరణ వాంగ్మూలం పేరుతో పోస్ట్ విడుదల చేశారు. ‘సీఎంకు నా ఫైల్ డిస్పోస్ చేయడం ఇష్టం లేనట్లు తోస్తుంది. నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే నేను సజీవ సమాధి అవుతాను. నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్బుక్ పోస్టులే సాక్ష్యం’ అని పేర్కొన్నారు.
నా దుస్థితికి తక్షణ కారణం రేవంత్ రెడ్డి
‘రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్‌గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడం. వెంటాడి వేటాడటం.. నా అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్. నేటి నా దుస్థితికి రేవత్ రెడ్డికి 21 నెలల క్రితం నేనిచ్చిన రిపోర్ట్‌పై ఇంకా చర్య తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం తక్షణ కారణం. ఇది చాలా హేయనీయం. వారికి ఫైల్ డిస్పోస్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. వారి ఇంటెన్షన్స్ ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం ఇది మరింత స్ట్రెస్‌కు గురిచేస్తుంది. బహుశా ఇదే నా చావుకు దారి తీస్తుందేమో..’ అని తెలిపారు.
సీఎం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు..
‘నేను ఇచ్చిన రిపోర్ట్ సీఎం చేతిలో పెట్టినప్పుడు దాన్ని అప్పటి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి చూస్తారని చెప్పారు. ఆపై నాలుగు నెలలకు ఓస్డీ వేముల శ్రీనివాస్ చేతుల్లోకి పోయింది. ప్రస్తుతం మా బ్యాచ్ మేట్ అయిన కలెక్టర్ హనుమంత రావు చేతుల్లో ఉంది. అంటే నా స్థాయిని ఎలా తగ్గిస్తున్నారో తెలుస్తుంది. నా మరణ వాంగ్మూలాన్ని కలెక్టర్‌తో రికార్డ్ చేయించచడం మినహా సీఎం ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు. కానీ నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారు. నా చెవులతో సీఎం స్టేట్మెంట్ వినాలి. నా ఎమోషన్స్ అర్జెంట్‌గా చల్లారాలి. లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది.’ అని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

