కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లందు పట్టణంలోని కరెంటు ఆఫీస్ సమీపంలో ఆటో ట్రాలీ, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఖమ్మం దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిని డీఎస్పీ గన్మెన్ (Gunman) భద్రం గా గుర్తించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.