హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి చెందారు. శనివారం ఉదయం 1,805 మెట్టు దగ్గర ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) కుప్పకూలారు.
దీంతో డీఎస్పీని దవాఖానకు తరలించేలోపే మృతి చెందారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం.. కృపాకర్ తిరుమలకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా.. ఘటనపై ఆయన కుటుంబసభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు.