హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): భాషాపండితుల పదోన్నతుల్లో ప్రమోషన్లు లభించని టీచర్లు శనివారం చలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) నిర్వహించి, సైఫాబాద్‌లోని డీఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన పోస్టులన్నీ చూపకుండా వెబ్ ఆప్షన్స్ సమయంలో రోస్టర్ అంటూ ఖాళీలు తగ్గించి పదోన్నతులను అడ్డుకోవడం అన్యాయమని వాపోయారు.
ఆర్‌యూపీపీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలకాంతికృష్ణ టీచర్లకు సంఘీభావం తెలిపారు. మల్టీజోన్ -1లో పదోన్నతుల తర్వాత 19 జిల్లాల్లో సగటున 20 -25 మంది భాషాపండితులు పదోన్నతి పొందలేకపోయారని ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చొరవ తీసుకుని, పదోన్నతులు కల్పించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తిచేశారు.