హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారుచేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి నియామక ఉత్తర్వులను అందజేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:3 చొప్పున చేపట్టాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల అసొసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి శనివారం ఎస్ఈ డైరెక్టర్ నర్సింహారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. టీఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించారని, గురుకుల బోర్డు ఇందుకు విరుద్ధంగా 1:2 చొప్పున జాబితా ఇచ్చారని గుర్తుచేశారు.