హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ-2008 బాధితులు మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో బైఠాయించారు. తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫిబ్రవరిలో క్యాబినెట్ నిర్ణయించి ఇప్పటివరకు అమలుచేయలేదని వాపోయా రు. వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారన్నారు.
ఉద్యోగాల హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పోస్టులు కేటాయించలేదని మండిపడ్డారు. 400 మంది అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాభవన్లోనే కూర్చున్నారు.