Southwest Monsoon | ముఖం చాటేసిన రుతుపవనాలు.. ఏప్రిల్ మాదిరిగానే 40 డిగ్రీల ఎండలు!
Southwest Monsoon | ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Southwest Monsoon | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. ఈనెల 15 వరకు వాతావరణం ఈ విధంగా ఉంటుందని తెలిపింది. 19తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
కాగా, రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్, హిస్సార్, మీరట్, గోరఖ్పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు కొనసాగుతున్నదని, దీంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉపరితల గాలులు 40 నుంచి 50 కి.మీ వే గంతో వీచే అవకాశం ఉండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

