పశువులకు మేతగా ఎండిన పొలాలు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్‌ను నమ్ముకొని సాగు చేసిన సీతంపల్లి, ఇప్పలపల్లిలోని సుమారు 700 ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొన్నది. సాగు ప్రారంభ సమయంలో డీ-83 కెనాల్ నీరు విడుదల చేయడంతో రైతులు సంబురపడ్డారు.
- ముత్తారం మండలంలో సాగునీటికి కటకట
- సీతంపల్లి, ఇప్పలపల్లిలో ఎండుతున్న పంటలు
ముత్తారం, మార్చి 30: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎస్సారెస్పీ డీ-83 కెనాల్‌ను నమ్ముకొని సాగు చేసిన సీతంపల్లి, ఇప్పలపల్లిలోని సుమారు 700 ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొన్నది. సాగు ప్రారంభ సమయంలో డీ-83 కెనాల్ నీరు విడుదల చేయడంతో రైతులు సంబురపడ్డారు.
నీళ్లు వస్తాయని దండిగా సాగు చేశారు. కానీ చుక్క నీరు రాకపోవడంతో పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పంట పొట్ట దశకు చేరింది. నీళ్లు లేక ఎండిపోతున్నది. నీటిని విడుదల చేయాలని అధికారులను కోరినా లాభం లేకపోవడంతో కడుపుమండి పశువులను మేపుతున్నారు.
నీళ్లు రావని చెప్తే సాగు జోలికి పోకపోదుం
కెనాల్ నీళ్లు రావని అధికారులు ముందే చెబితే మేం పంట సాగు జోలికి పోకపోదుం. వరి వేయక పోయేటోళ్లం. కెనాల్ నీళ్లు వస్తయని ఆశతో నేను ఆరెకరాల్లో వరి వేసిన. కానీ ఒక్కసారి వచ్చిన నీళ్లు మళ్లీ రాలేదు. చేసేదేం లేక పొట్టదశలో పంటను విడిచిపెట్టిన. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టిన. మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బోయిని రాజమల్లు, సీతంపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

