వేములవాడ: వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట్టి.. తిప్పాపూర్‌లోని కదిరే రాజమల్లయ్య దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రాజ మల్లయ్య బైక్ కన్సల్టెన్సీలోని ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువ కానిస్టేబుల్
రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ కానిస్టేబుల్ మృతి(Constable dies) చెందాడు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి చెందిన అజ్మీరా కల్యాణ్ నాయక్(29) నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి 7 వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో కల్యాణ్ నాయక్‌ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం గర్జనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సుష్మ, కుమార్తె అభియుక్త, కుమారుడు అభిషేక్ ఉన్నారు.