సుల్తాన్ బజార్,నవంబర్ 11. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ, కార్యదర్శిగా ఎస్ విక్రమ్ కుమార్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల పట్ల చేదోడువాదోడుగా ఉంటూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న ముజీబ్ హుస్సేనీ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్ని క కావడం ఆయన పనితీరుకు నిదర్శనమని రాజేందర్ అభినందించారు. ఈ ఎన్నికతో తనకు మరింత బాధ్యత పెరిగిందని ముజీబ్‌హుస్సేనీ పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు గా బుసిరెడ్డి వెంకట్‌రెడ్డి, మోహన్‌రావులు వ్య వహరించారు. కాగా, దివంగత ఏఎం చంద్రశేఖర్ చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన నూతన హాల్‌ను రాజేందర్, ప్రతాప్ ప్రారంభించారు