హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 39వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్టు ప్రాంతీయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాజు బోళ్ల ప్రకటనలో తెలిపారు. నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఢిల్లీలో నిర్వహించే స్నాతకోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, హైదరాబాద్లో జరిగే స్నాతకోత్సవానికి బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుంచి 2,815 విద్యార్థులు డిగ్రీ పట్టాలు స్వీకరిస్తారని వెల్లడించారు.