మెట్పల్లి, జనవరి 16 : కోరుట్ల నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తికి నిధులిచ్చి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకూ నీరందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బరాజ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి పలు సమస్యలపై వివరించినట్టు చెప్పారు. గంగనాల ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించేందుకు సదర్మాట్ వద్ద ప్రత్యేక తూము ఏర్పాటు చేయాలని, ఎస్సారెస్పీ కాకతీయ ఉపకాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా చూడాలని సీఎంను కోరినట్టు పేర్కొన్నారు. పలు చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల అభివృద్ధికి నిధుల మంజూరుతో పాటు కోరుట్ల, మెట్పల్లిలో దవాఖాన, పాఠశాలల గొర్రెపల్లి చెరువు పునరుద్ధరణ, అలాగే మెట్పల్లిలో దవాఖాన, పాఠశాలల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.