హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బలహీనవర్గాల వెనుకబాటుకు కాం గ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజుయాదవ్ ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కుట్రలకు బీసీలు రాజకీయంగా బలయ్యారని పేర్కొన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి వచ్చి సంతాపసభ పెట్టినట్టుగా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటన ఉన్నదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ బీసీ ల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలనే సభలో చదివి.. కాం గ్రెస్ పార్టీ తన పరువును తీసుకున్నదని విమర్శించారు. తె లంగాణ ప్రభుత్వం బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, మారెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేసిందని, ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నదని, వివిధ స్థాయి ప్రజాప్రతినిధుల్లో బీసీ వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారని
తెలిపారు.