చకచకా ‘అంబేద్కర్ స్మృతివనం’
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
- దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం
- ట్యాంక్‌బండ్ ఒడ్డున మ్యూజియం
- మంత్రి కొప్పుల పర్యవేక్షణ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు పనులు కీలకదశకు చేరుకొన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షణలో పనులు చకచకా సాగుతున్నాయి. దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్ 14న నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
ఆ వెంటనే ట్యాంక్‌బండ్‌ను ఆనుకొని ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.04 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 50 అడుగుల ఎత్తయిన పీఠంపై 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతోపాటు మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని, 2.93 ఎకరాల్లో పార్క్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసిన వెంటనే పనుల ప్రారంభమయ్యాయి. విగ్రహ ఏర్పాటుకు శాస్త్రీయ పరీక్షలన్నింటినీ పూర్తి చేసి పనులను చేపట్టారు.

డిసెంబర్‌నాటికి అందుబాటులోకి..
స్మారక భవనానికి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. స్మృతివనం అనుబంధ భవనాలకు సంబంధించి టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, అండర్ గ్రౌండ్ సంప్, సెక్యూరిటీ రూం నిర్మాణ పనులు సైతం పూర్తికాగా, ప్లాస్టరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్మృతివనం తూర్పు, ఉత్తరం వైపు ప్రహరీ నిర్మాణంతోపాటు గ్రిల్ ఫిక్సింగ్ పనులు పూర్తికాగా, దక్షిణం వైపు గ్రిల్ ఫిక్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి 50 అడుగుల పీఠం ఇప్పటికే పూర్తయింది. మొత్తంగా డిసెంబర్‌నాటికి స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

