హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే కుట్రలు, కుతంత్రాలు పుడుతున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. అక్కడి నుంచే అబద్ధాలజ్యోతికి గాలి కథల లీకులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ కాకమ్మ కథలనే ‘ఆంధ్రజ్యోతి’ వండివారిస్తుందని దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాంటి కాకమ్మ కథల్లో భాగంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కుంభకోణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ బంధువు అయిన రాజ్‌పాకాల పాత్ర ఉన్నదని.. కొన్ని పత్రికల్లో అబద్ధపు వార్తలు రాయించారని ఆరోపించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.