హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఇంకా 2,19,693 సీట్లు ఖాళీగా ఉన్నాయి.