హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్-2026 మూడో విడత సీట్ల కేటాయింపును రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 93,516 మందికి సీట్లు కేటాయించారు. విద్యార్థులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థి లాగిన్‌తో వాట్సాప్ ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
అభ్యర్థులు శుక్రవారం నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసినవారు శనివారం నుంచి జూలై 4 వరకు కళాశాలలకు హాజరై సీసీ ఓటీపీని సమర్పించి ప్రవేశాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించారు.