హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక కారణాలతో టెండర్లను తిరసరించడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు అభిప్రాయపడింది. రూ.435 కోట్ల విలువైన రైల్వే కాంట్రాక్ట్ కోసం ఏఏసీజీ సుప్రీం లాండ్రీ సర్వీసెస్ సంస్థ వేసిన ఆర్థిక బిడ్‌ను అధికారులు పరిశీలించకుండా సాంకేతిక కారణాలతో తిరస్కరించడంపై విచారణ చేపడతామని ప్రకటించింది.
టెండర్ల ప్రక్రియ అసంబద్ధంగా, ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది.
తాంసి, ఆగస్టు 5: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో నమోదైంది. మండల కేంద్రంలోని ఓ పాఠశా లలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కీర్తి రాజా గీతేష్ తమపట్ల అసభ్యక రంగా ప్రవర్తించినట్టు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు.