మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 15 : రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పండ్ల వ్యాపారులపై ఆర్టీసీ అధికారులు జులుం ప్రదర్శించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని కొత్త బస్టాండ్ మీద ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులతోపాటు చిరు వ్యాపారుల కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్టీఎల్ జోన్లో బస్టాండ్ ఉందని, వెంటనే తొలగించాలని డిమాండ్‌చేశారు. బస్టాండ్ ముందు పేదలు పెట్టుకున్న పండ్ల వ్యాపారాలను తొలగించవద్దని కోరారు. తొలగింపు ప్రక్రియ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.