హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ‘స్టాక్ ప్రాఫిట్’, వాట్సాప్ నంబర్ +62815-2937-82797ను సంప్రదించండి’ అంటూ వచ్చే సైబర్ చీటింగ్ మెసేజ్లకు మోసపోవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏడీజీ శిఖాగోయెల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగు చూస్తున్న వేళ.. వాట్సాప్లో‘స్టాక్ ప్రాఫిట్’తో లాభాలు, +62 కోడ్ నంబర్లతో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ప్రాఫిట్ల నుంచి అనువజ్ఞులతో మాట్లాడి, ప్రభుత్వ నిబంధనలు పాటించే వాటిల్లో స్టాక్స్ చేయాలని కోరారు. ఏదైనా సైబర్ నేరానికి గురయ్యారని తెలిసిన వెంటనే, గంటలోపు (గోల్డెన్ అవర్) 1930కి కాల్ చేయాలని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.