చౌటుప్పల్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, దండు మల్కాపూర్, ఖైతాపూర్ గ్రామాల్లో యాదవ, కురుమ సోదరులను కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో గొల్ల,కురుమ ఆర్థిక అభివృద్ధి కోసం గొర్రెలను పంపిణీ చేసిందని తెలిపారు. మొదటి విడత లో 70 కోట్లు , రెండో విడత లో సుమారు 93 కోట్లతో 12661 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామని నిధులు వారివారి అకౌంట్లలో జమ అయ్యాయని వివరించారు. అకౌంట్ లో జమ చేయబడ్డ డబ్బులకు ఫ్రిజింగ్ లేదని వెల్లడించారు. గొర్రెల పథకం మీద రాజగోపాల్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.