హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈ కేసులో పోలీసులతోపాటు ఫిర్యాదుదారుడు చక్రధర్‌గౌడ్‌కు జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం గురువారం నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా నిందితునిగా ఉన్నారు.