హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు సహాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలిసిన పలువురు సీఎంఆర్ఎఫ్కు చెక్కులను అందజేశారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు శరణి, ఈడీ పునీత్ రూ.2.5కోట్లు, శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వైఎస్ చక్రవర్తి రూ.కోటి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ వై శోభ రూ.50 లక్షలు, మోల్డ్‌టెక్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ రాణాప్రతాప్ రూ.25 లక్షలు, టెక్నో పెయింట్స్ సంస్థ డైరెక్టర్లు ఆకునూరి శ్రీనివాస్‌రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ రూ.20 లక్షలు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గాభవానీ, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి రూ.5 లక్షలు, కుమారీ ఆంటీ రూ.50వేలు చెక్కు ఇచ్చారు.