యాదాద్రి, ఫిబ్రవరి 4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరింది. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాదరావు రూ.51 వేలు, హబ్సిగూడకు చెందిన కందాడి జనార్దన్‌రెడ్డి-వసుమతి దంపతులు రూ.51 వేలు, భువనగిరి పట్టణానికి చెందిన జీ లక్ష్మీనర్సింహగౌడ్ రూ.25 వేలు, జే నర్సింగరావు 11,116 రూపాయల విరాళం సమర్పించారు. ఈ నగదును బాలాలయంలో ఆలయ అధికారులకు అందజేశారు.