ఇచ్చోడ ; ఏప్రిల్ 27న ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకల ఖర్చులకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు రూ.1,02,003 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ముక్రా (కే) గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినట్టు తెలిపారు. అందుకే ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సదరు మొత్తాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపించాలని కోరుతూ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి మాట్లాడుతూ.. నాటి జల దృశ్యం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని తెలిపారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ తదితరులు పాల్గొన్నారు.