జూలై 4న కడవెండిలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన అమరుడైన జూలై 4వ తేదీన ఆయన స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి లో ఆవిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

వరంగల్ : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన అమరుడైన జూలై 4వ తేదీన ఆయన స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి లో ఆవిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు కడవెండి నుంచి వచ్చిన దొడ్డి కొమురయ్య వారసులు, గ్రామస్తులు, మండల నాయకుల సమక్షంలో హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో కొమురయ్య సంస్మరణ ఉత్సవాల పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. ఆనాడు ఆయన ప్రాణ త్యాగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు. నాటి హైదరాబాద్ దేశానికి నైజాం, రజాకార్ల నుండి విముక్తి కలగడానికి బాటలు వేసిందన్నారు. ప్రజలు తమ విముక్తికోసం సాయుధులై సమర శంఖం పూరించేలా పురికొల్పింది అని మంత్రి చెప్పారు.
దొడ్డి కొమురయ్య గురించి సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తారని అన్నారు, ఆయన నా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వాడు కావడం గర్వకారణం అన్నారు. అందరి భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

