హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని డాక్టర్లపై సైబర్ మోసగాళ్లు దృష్టిపెట్టారని, ఫిషిం గ్ లింక్స్‌కు దొరుకుతున్న వైద్యులను టార్గెట్ చేసి ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు దోచుకున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. వైద్యుల ను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో మంగళవారం వైద్య సంఘాల ప్రతినిధులతో శిఖాగోయల్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 735 మంది వైద్యులు సైబర్ మోసాలకు గురవగా, మొత్తం రూ.29.88 కోట్లను నేరస్తులు దోచుకున్నారని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు డాక్టర్లను ఎక్కువగా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసగిస్తున్నట్టు శిఖాగోయల్ తెలిపా రు. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మో సాల పేరుతో 127మంది డాక్టర్ల నుంచి రూ.22.39 కోట్లు, డిజిటల్ అరెస్ట్ పేరు తో 22 మంది డాక్టర్ల నుంచి రూ.2.26 కోట్లు, ఐడెంటిటీ థెఫ్ట్తో 144 మంది నుంచి రూ.2.05 కోట్లు, ఇంపర్సనేషన్ పేరుతో 181 మంది నుంచి రూ.1.32 కోట్లు, అడ్వైర్టెజ్‌మెంట్ పేరుతో 188 మంది వైద్యుల నుంచి రూ.1.17 కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్నారు.
ఇవేకాకుం డా ఉద్యోగాల పేరుతో మోసాలు, సెక్స్టార్షన్, లోన్, ఇన్సూరెన్స్, యూపీఐ, మ్యాట్రిమోనియల్, క్రిప్టోకరెన్సీ మోసా లు నమోదైనట్టు తెలిపారు. సైబర్ ఆర్థిక మోసాల కేసుల్లో ‘గోల్డెన్ అవర్’ అత్యం త కీలకమని పేరొన్నారు. మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీలను నిలిపివేసి రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్టు గోయల్ తెలిపారు.