ములుగు రూరల్, జూలై 19 : ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంతో శనివారం ఓ నిండు గిరిజన గర్భిణికి ప్రాణాపాయస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంకు చెందిన గొంది ఆదిలక్ష్మికి 25 ఏండ్ల క్రితం వివాహమైంది. నిండు గర్భిణిగా ఉన్న ఆదిలక్ష్మికి శనివారం నొప్పులు రావడంతో ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కడపులో బిడ్డకు హార్ట్ బీటింగ్ లేదని చెప్పి ములుగు దవాఖానకు రెఫర్ చేశారు. అక్కడి వైద్యు లు ఆదిలక్ష్మిని పరీక్షించి కడుపులోని బిడ్డ మెడ నరాలు చితికాయని హనుమకొండలోని జీఎంహెచ్కు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ చనిపోయిందని నిర్ధారించి, మృత శిశువును తొలగించి ఆదిలక్ష్మిని కాపాడారు. ఆదిలక్ష్మి మణుగూరులోని ప్రైవేటు దవాఖానతో పాటు స్థానిక ప్రభుత్వ దవాఖానలో ప్రతినెలా వైద్యం చేయించుకున్నారు. కాన్పు సమయంలో ప్రభుత్వ దవాఖానకు వస్తే వైద్యం అందకపోవడంతోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గర్భిణులకు అందని వైద్య సేవలు..
ములుగులోని ప్రభుత్వ దవాఖాన డీసీహెచ్ఎస్ నుంచి డీఎంఈకి బదిలీ అయినప్పటి నుంచి గర్భిణులకు ప్రసూతి సేవలు అందడంలేదు. ఇందుకు నిదర్శనమే మే డారం నుంచి కాన్పు కోసం 108లో వచ్చి న గర్భిణి ఉదంతం. ఏ పాజిటివ్ రక్తం అందుబాటులో లేదని డ్యూటీడాక్టర్ అడ్మి ట్ చేసుకోకుండా హనుమకొండ జీఎంహెచ్కు పంపించారు. అత్యవసరమైతేనే రెఫ ర్ చేయాల్సి ఉన్నా అలాచేయలేదు. 108 సిబ్బంది ఆమెను జీఎంహెచ్కు తీసుకెళ్లగా వైద్యులు కాన్పు చేసినట్టు తెలిసింది. ము లుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100% కాన్పులు కావాలని ఉన్నతాధికారులు చెబుతున్నా ఆచరణలో అమలు కావడంలేదు. మంత్రి సీతక్కతోపాటు కలెక్టర్ స్పందించి గర్భిణులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.