వరంగల్ చౌరస్తా, మార్చి 31 : వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 13న ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మహిళల కోసం హనుమకొండలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో జిల్లాలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన సుంకరి యాకయ్య కూతురు పూజ (25) అరుదైన వ్యాధి తో బాధపడుతూ శిబిరానికి వచ్చింది. తలలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న ఆమె కు దాస్యం భరోసానిచ్చారు. విషయాన్ని ఎంజీ ఎం వైద్య సిబ్బందికి తెలియజేశారు. వెంటనే ఎంజీఎం వైద్యులు రంగంలోకి దిగి ఆమెను దాదాపు 10 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి, తలలో రక్తం గడ్డకట్టిన విషయాన్ని గుర్తించారు.
అత్యంత సున్నితమైన ప్రదేశంలో రక్తపు గడ్డను తొలగించడం కష్టసాధ్యమైనా ఎంజీఎం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రాంచందర్ పర్యవేక్షణలో వైద్యులు గంటలకొద్దీ శ్రమించి శస్త్రచికిత్సను రెండు రోజుల క్రితం విజయవంతంగా పూర్తి చేశా రు. కాగా శుక్రవారం దవాఖానకు వెళ్లి పూజితను చీఫ్‌విప్ దాస్యం పరామర్శించారు. ఈ సందర్భం గా పూజ తండ్రి యాకయ్య మాట్లాడుతూ తాము నాలుగు ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లినా ఎక్కడా ఆపరేషన్ చేయలేమని, ఒకవేళ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమని చెప్పారని తెలిపారు. ఎంజీఎం దవాఖానలో ఆపరేషన్ విజయవంతం కావడం సంతోషంగా ఉన్నదని, ఇందుకు సాయం చేసిన చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆర్ఎంవో మురళి ఉన్నారు.