ములుగు, జూలై10(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లికి చెందిన బానోత్ రజిత కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సోషియాలజీ విభాగంలో కేయూ మాజీ వైస్ చాన్స్‌లర్ రమేశ్ పర్యవేక్షణలో పరిశోధన చేసి ‘మిషన్ కాకతీయ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ సోషియాలజికల్ స్టడీ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై రజిత 2022లో పుస్తకాన్ని రచించి అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
రజిత 10వ తరగతి వరకు ములుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్ జూనియర్ కళాశాలలో, అంబేద్కర్ ఓపెన్ వర్సీటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు.