MBBS | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘డాక్టర్ కావాలంటే మాట లా.. రూ.లక్షలు, రూ.కోట్లతో వ్యవహా రం. పేద, మధ్య తరగతి జీవితాలకు వైద్య విద్య ఒక కల మాత్రమే’ ఇది ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద విద్యార్థుల డాక్టర్ కల నెరవేరుతున్నది. ఉచితంగా వైద్య విద్య పూర్తి చేసి, ‘డాక్టర్’ పట్టా అందుకొనే అవకాశం ఏర్పడింది. సాధారణంగా వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు వర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజుతోపాటు సీడీఎస్, ఈ లైబ్రరీ, లైబ్రరీ, సెంట్రల్ స్టోర్, కాషన్ డిపాజిట్, అకడమిక్ డెవలప్మెంట్ ఫండ్, నాన్ గవర్నమెంట్ ఫండ్ వంటివి ఉంటాయి. హాస్పిటల్ ఫీజు అదనం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో వైద్య విద్య అభ్యసించాలన్నా రూ.5-6 లక్షల వరకు ఖర్చవుతుంది.
ఇక మేనేజ్మెంట్ కోటా అయితే రూ.50 లక్షలకు పైమాటే. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రం గరిష్ఠంగా రూ.లక్షలోపు ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తి చేయవచ్చు. ఆ మొత్తాన్ని రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం తిరిగి విద్యార్థికే ఇస్తుంది. అంటే చదువు ఉచితంగా పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్ల సంఖ్య 850 మాత్రమే. లక్షల మందితో పోటీ పడి వందల్లో ర్యాంకులు తెచ్చుకోలేక తెల్లకోటు వేసుకోవాలనుకొనే ఎంతోమంది పేదల ఆశలు కలగానే మిగిలిపోయేవి.
ఏటా రూ.440 కోట్లు ఆదా..
ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవాలంటే ఒక్కో విద్యార్థికి సగటున ట్యూ షన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి ఏటా ఖ ర్చు రూ.15 లక్షలుగా అంచనా వేద్దాం. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు 2,940. వీటి ద్వా రా.. ఏటా విద్యార్థులకు రూ.440 కోట్ల మేర ఆదా అవుతున్నట్టు లెక్క. నాలుగేండ్ల కోర్సుకు లెక్కిస్తే.. రూ. 1,800 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఇవి కేవలం ట్యూషన్ ఫీజు రూపంలో మిగిలేవి మాత్రమే. అదనపు ఫీజులు, ఖర్చులు లెక్కిస్తే ఏటా రూ.500 కోట్లకుపైగా తేలుతుంది. ఏటా రూ.15 ల క్షల చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఒక్కో విద్యార్థికి కోర్సు పూర్తయ్యే సమయానికి సగటున రూ.60 లక్షలకుపైగా ఫీజు ఆదా అవుతున్నట్టే లెక్క. పై గా ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్లు గా పనిచేసేవారికి ప్రభుత్వం ప్రతి నెల రూ.25 వేల ైస్టెఫండ్ అందిస్తున్నది.
అందుబాటులోకి 3 వేల సీట్లు
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేదలకు స్పెషాలిటీ సేవలు, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను చేరువ చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ ఏడాదితో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ పూర్తికానున్నది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులకు తొమ్మిదేండ్లలోనే 2,940 సీట్లు పెరిగాయి. ఈ ఏడాదితో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య 3,790కి పెరిగింది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకా రం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజు రూ.10 వేలు. వర్సిటీ ఫీజు రూ.12 వే లు. మిగతా ఫీజులన్నీ కలిపినా ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా రూ.30 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని ప్రభుత్వం రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్గా దాదాపుగా తిరిగి విద్యార్థికే చెల్లిస్తున్నది. హాస్టల్ వస తి ఉచితం. అంటే.. విద్యార్థులు ఉచితంగా వైద్య విద్య అభ్యసిస్తున్నారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ట్యూషన్ ఫీజులు, ప్రభుత్వ కాలేజీల ఫీజులతో పోల్చినప్పుడు ప్రభుత్వ కాలేజీల వల్ల కలిగే ప్రయోజనం అర్థం అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కో టా ట్యూషన్ ఫీజు ఏటా రూ.60 వేలు. మేనేజ్మెంట్ కోటాలో రూ.11.55 ల క్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉన్న ది. ఇదంతా ప్రభుత్వం నిర్ణయించిన ఫీ జు మాత్రమే. ఇక ఎన్నారై కోటా కింద ఫీజు రూ.23 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ఉన్నది. కాలేజీలు అదనంగా వసూలు చేసే అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫండ్ వంటివి అదనం. హాస్టల్ ఫీజు కూడా కలుపుకుంటే కనీ సం ఏటా రూ.3-4 లక్షల వరకు అదనంగా భారం పడుతుంది.