హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో మరో నిందితుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 19 మంది నిందితులను అరెస్టు చేశామని, తాజాగా విశాఖపట్నంకు చెందిన 24వ నిందితుడు (ఏ24) డాక్టర్ రుట్టాల వెంకటరామ సంతోష్ నాయుడును శుక్రవారం ఏలూరులో అరెస్టు చేసి హైదరాబాద్ ఎల్బీనగర్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చామని డీజీ చారుసిన్హా ప్రకటించారు.
అనస్థీషియన్‌గా పనిచేస్తున్న వెంకటరామ సంతోష్ నాయుడు ఈ కేసులోని ఇతర నిందితులైన రాజశేఖర్, అవినాష్ తదితరులతో కలిసి హైదరాబాద్‌లోపలు హాస్పిటల్స్‌లో అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో పాలుపంచుకున్నట్టు సీఐడీ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. దాతలు, గ్రహీతలకు అనస్థీషియా ఇచ్చేందుకు ప్రధాన నిందితుడు పాములపాటి పవన్ సంతోష్‌ను హైదరాబాద్ రప్పించేవాడని, శస్త్రచికిత్సకు సంతోష్ రూ.2.5 లక్షలు తీసుకునేవాడని వివరించారు.