యాచారం, ఫిబ్రవరి 28 : రైతుల ఆ మోదం లేకుండా ప్రభుత్వం బలవంతం గా వ్యవసాయ భూములు సేకరించొద్దని కిసాన్ సంఘర్ష సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సునీలం సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో ఢిల్లీకి చెందిన న్యాయనిపుణులు, శాస్త్రవేత్తలు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్వర్యంలో శుక్రవారం ఫార్మా బా ధిత రైతులతో సమావేశమయ్యారు. భూసేకరణ చట్టాలు, భూములను కాపాడుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిసాన్ సంఘర్ష స మితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సునీలం మాట్లాడుతూ.. రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సంఘటితం కావాలని, రైతులు తమ భూములను తిరిగి సాధించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని, బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్ హైకో ర్టు అడ్వకేట్ ఆరాధన భార్గవ్ మాట్లాడు తూ.. ఆదానీ పవర్ ప్రాజెక్టు భూ సేకరణకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమం చేశారో, తిరిగి తమ భూములను ఎలా కాపాడుకున్నారో వివరించారు. శాస్త్రవేత్త బాబురావు , న్యాయవాది శ్రీకాంత్, ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సభ్యులు నారాయణ, సా మ నిరంజన్, సందీప్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అచ్చిరెడ్డి, పాపిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు.