హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా ఆహ్వానించదగ్గదే అని చెప్పారు.
మహబూబ్‌నగర్‌లో 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 78 మంది దివ్యాంగులకు ఇళ్లపట్టాలు ఇవ్వగా వారు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని, ఆక్రమణల పేరుతో గురువారం బుల్డోజర్లతో కూల్చివేయడంతో వారంతా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో హైదరాబాద్‌లోని హస్మత్‌పేట్, అల్వాల్‌లో పేదల ఇళ్లు నేలమట్టం చేశారని విమర్శించారు. ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పేరుతో పేదలను బజారుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.