Thummala Nageswara Rao | బోర్లల్లో నీళ్లున్నాయని వరి సాగు చేయొద్దు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు
బోర్లలో నీళ్లున్నాయని వరి సాగుచేసే పద్ధతిని రైతులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని, అందువల్లే మార్కెటింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టిసారించాలి
- కేంద్రం కారణంగానే కొనుగోళ్లల్లో ఇబ్బందులు : తుమ్మల
ఖమ్మం, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బోర్లలో నీళ్లున్నాయని వరి సాగుచేసే పద్ధతిని రైతులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని, అందువల్లే మార్కెటింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణం కారణంగానే రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదనపు గోదాముల ఏర్పాటుకు, రవాణాకు అవసరమైన డీజిల్ పంపిణీకి సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే రైతులు అవస్థ పడాల్సి వస్తున్నదని తెలిపారు. రైతులు పంటల మార్పిడీని తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపాలని సూచించారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయడం ద్వారా విక్రయానికి ఇబ్బంది ఉండదని చెప్పారు.
పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వీటివైపు రైతులు ఆసక్తి పెంచేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
ఎరువుల ధరలుతగ్గించాలి: రైతు సంఘం
హైదరాబాద్, జూన్ 3(నమస్తే తె లంగాణ) : ఎరువుల ధరలు త గ్గించి సకాలంలో రైతు భరోసా ఇ వ్వాలని, నాణ్యమైన విత్తనాలు సరఫరా చే యాలని ఈ నెల 6, 8 తేదీల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్టు రైతు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం యూ రియా యాప్‌ను రద్దు చేయాలని డి మాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

