వ్యవసాయ యూనివర్సిటీ, మే 4 : వానకాలం సీజన్ విత్తనాలకు సంబంధిం చి రైతులు ఇబ్బంది పడొద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం సీడ్ అండ్ రిసెర్చ్ టెక్నాలజీ(ఎస్ఆర్టీసీ)డైరెక్టర్ మాధవీలత సూచించారు. రాష్ట్రంలోని నేలలకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే వరి రకాలు బీపీటీ-5204, ఎంటీయూ-1010, ఆర్ఎన్ఆర్-15048, ఎంటీ యూ-1001 విజేత, తెలంగాణ హంస-10547 తదితర రకాలు ఈ నెల 14 నుంచి అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. తక్కు వ ధరకు లభిస్తున్నాయని ప్రైవేట్ వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 5 నుంచి ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ఉంటుందని సూచించారు. సాగులో సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులతో కూడి న కమిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.