Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో డీజేలు, ఫైర్‌క్రాకర్స్‌పై పోలీసులు నిషేధం విధించారు. శబ్దకాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని నిషేధిస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. డీజేలు, ఫైర్ క్రాకర్స్‌పై డయల్ 100కు ఫి ర్యాదులు రావటంతో నగరంలోని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మతపెద్దలతో ఇటీవల సీవీ ఆనంద్ సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డీజేలు, సౌండ్ మిక్సర్లు, హై సౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంట ల వరకు ఈ నిషే ధం అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించనున్నారు.
దవాఖానలు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు డీజేపై నిషేధం అమలులో ఉంటుంది. మతపరమైన ర్యాలీల్లో ఎలాంటి డీజేను వాడకూడదు. సౌండ్ సిస్టంను పరిమిత స్థాయిలో అనుమతిస్తారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికీ పోలీస్ క్లియరెన్స్ ఉండాలి. అటు.. నాలుగుజోన్లలో సౌండ్ సిస్టం జనావాసా ల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్, రాత్రివేళల్లో 45 డెసిబుల్స్‌కు మించకూడదు. మతపరమైన ర్యాలీల్లో బాణాసం చా కాల్చడం పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేండ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. పదేపదే ఉల్లంఘిస్తే ప్రతి రోజు రూ.5 వేల ఫైన్ వేస్తారు.