హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి హర్షం ప్రకటించారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చిన వెంటనే సానుకూలంగా స్పందించి,
చర్యలు తీసుకున్న కేసీఆర్కు రాష్ట్ర దివ్యాంగులు రుణపడి ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వికలాంగుల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు.