హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(వర్క్స్) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.