ప్రశాంతంగా డీఏవో పరీక్ష
రాష్ట్రంలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 (డీఏవో) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
- 67,830 మంది హాజరు
- 38,423మంది గైర్హాజరు
- ఒక్క పరీక్షే రాసిన 927 మంది డిస్ క్వాలిఫై
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 (డీఏవో) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని 241 కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 67,830 మంది హాజరయ్యారు. ఈ పోస్టులకు 1,06,253 మంది దరఖాస్తు చేయగా, 98,854 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 38,423 మంది గైర్హాజరయ్యారు.
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగిన పేపర్- 1కు 67,830 మం ది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్-2కు 66,903 మంది హాజరయ్యారు. ఉదయం పరీక్ష రాసి, మధ్యాహ్నం పరీక్షకు గైర్హాజరవడంతో 927 మంది ఆటోమేటిక్గా డిస్ క్వాలిఫై అయినట్టు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్ నుంచి కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులు డీఏవో పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. 241 మంది చీఫ్ సూపరింటెండెం ట్లు, 98 మంది లైజన్ ఆఫీసర్లు, 241మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, 23 ఫ్లయింగ్ స్వాడ్స్ మొత్తం 4,674 మంది పరీక్షల విధుల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

